శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
103. ఆజ్ఞ్యాచక్రాంత రాళస్థా | ||
*అంతరాళస్థా* : నవావర్ణములన్నింటికీ మధ్య బింధువు. ఆ బిన్దుస్వరూపిణియే ఆత్మ -పరమాత్మ స్వరూపిణియైన పరాదేవత. *ఆజ్ఞ్యారాకా* : అజ్ఞ్యాచక్రమునందు పూర్ణచంద్ర స్వరూపిణియై వెలుగొందునట్టి ఆత్మ స్వరూపిణియే 'ఆజ్ఞ్యారాకా'. *చరాంతస్థా* : చైతన్యము ఎచ్చట వున్నదో అచ్చట చర లక్షణము వస్తుంది. దేశంద్రియములకు నాయకత్వముకలది మనస్సు. మనస్సు ఆజ్ఞ పెట్టడం స్థానము కనుక దానికి ఆజ్ఞాచక్రము అని పేరు. కించిత్ బ్రహ్మా జ్ఞ్యానము కూడా కలుగును. అజ్ఞ్యాచక్రములో సుషుమ్న మూడు లిప్తల కాలము విరాట్ దర్శనము తరువాత పూర్ణచంద్ర దర్శనాన్ని ఇస్తుంది. రెండూ కనుబొమల మధ్య స్థానం ఆజ్ఞ్యాచక్రస్థానం. అక్కడ వున్న తల్లికి నమస్కారము 🙏 🌺మనసు లో వున్న భ్రమలు, భ్రాంతులు, భయములనుండి ప్రాలదోలడానికి, తమ బుద్ధియుక్క స్థిరత్వాన్ని పెంచి, జ్ఞ్యానవేషణము వైపు మనస్సు ని మరల్చుతుంది. 🌺 |