శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
133. నిరంజనా | ||
దేనియందు రంజింపని అవసరము లేనిది అని సామాన్య అర్ధం. ఇందులో *గుప్త నామాలు :* *అంజన* : మహామాయా స్వరూపిణియై నాలుగు అంతఃకరణ ప్రవృత్తులతో, జీవులకు జీవచాపల్యాన్ని సృష్టించే అంజన కాటుకవంటిది *రంజన :* విషయ సౌఖ్యములయందే రమించుచూ అవే శాశ్వతమని భావన చేసేటట్లు జీవులను చేసేది అమ్మవారు. కార్యకరణాతీత లక్షణం చేత నిరంజన. ఆమెకి మాయా అంటదు కాబట్టి ఆమె నిరంజన. మాయారూపిణిగా రంజన. బ్రహ్మరూపిణిగా నిరంజన. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺 విభిన్న గుణాలు, బలహీనతలు కలిగిన వారి మధ్యలో వున్నప్పటికీ అవి ఏవి తనకు అంటని స్వచ్చమైన పుష్పం వలే ఉండగలుగుతాము. మన స్వచ్చతకు మరక అంటని స్థాయికి ఎదుగుతాము 🌺 |