శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
182. నిష్క్రియా | ||
క్రియా రహితురాలు. క్రియాలన్నీ సర్వాధిష్టాన చైతన్యమునుండియే ఆవిర్భావించును. ఈ క్రియాలన్నీటికి ఆమె అతీత. పొందవలసింది వున్నపుడు చేయవలసిన క్రియ వుండును. క్రియ చేయడం ద్వారా లాభం పొందుతాము, సతఫలితన్ని పొందుతాము. ఆ ఫలాపేక్ష లలితా పరమేశ్వరికి లేదు, అందుకనే నిష్క్రీయా.ఆ తల్లికి నమస్కారము 🙏 🌺చేయకూడనివి క్రియలు, పనులను చెయ్యము. వాటికోసం మనస్సు వేంపర్లాడదు 🌺 |