శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
124. శర్వాణి | ||
శాంభవీ విద్యలో ఇది మూడవ మెట్టు. సర్వజీవపోషక శక్తి ఈ శర్వాణి, సకల, అదే పిండాండములో కుండలినీ. అంతటా వ్యాపించి వున్నది. ఆజ్ఞలో మొదటి పర్వతాగ్రమువలె దాని వెనుక వెలుగువలె దర్శనము ఇస్తుంది. దానినే విరాట స్వరూప దర్శనం అంటారు. పృద్వితత్వమైన మూలాధారం నుండి పంచభూత పంచకోశతత్వాల్ని సహకరించుకుంటూ ఆజ్ఞాచక్రాన్ని మొదట చేరినప్పుడు నలుపు తెలుపుల కలగలపు కాంతి కనిపిస్తుంది. అదే శర్వాణి. వేదములలో మేఘాన్ని పర్వతము అని పిలుస్తారు. మేఘవర్ణంతో కలిసిన వెలుగే పార్వతి అని రహస్యం. ఆ పార్వతియే ఈ శర్వాణి. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺సకలము ఆ పార్వతి దేవి అని, మనసా, వాచా, కర్మణా త్రికర్ణ శుద్ధి తో వేడుకుంటే, ఈ సృష్టి, స్థితి, లయ కారణములు మనకి జ్ఞాన భోదని కలిగిస్తాయి 🌺. |