శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
161. నిరహంకారా | ||
అహంకారము లేనివంటిది. చైతన్యరూపము అయిన తల్లీ అహంకార రహితమైనది. అహంకారమును జయించినది. మమతా, అనురాగాలతో ముడి పడి వుంటుంది ఈ అహంకారము. సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా, మైత్రితో/స్నేహపూరితముగా, కారుణ్యముతో ఉంటు, మరియు అహంకారము లేకుండా, సుఖ-దుఃఖముల రెండింటి యందు సమ భావన వ్యక్తి పరుస్తూ, మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారో, వారు ఎల్లప్పుడూ తృప్తితో, భక్తితో ఆ పరాత్పరి/ జగన్మాతకు కు అత్యంత సమీపముగా వుంటారు, అమ్మవారి అనుగ్రహన్నీ పొందుతారు. అకుల మార్గములో వెళ్తే, ఈ నిరహంకార అన్న స్వభావము ఏర్పడుతుంది. అహంకారరహిత చైతన్య స్వరూపమైన ఆ తల్లికి నమస్కారము 🙏 🌺మన నిజజీవన ప్రయాణములో, ఎన్నో మమకారాలు, రాగము, ద్వేషములు కలిగించే సంఘటనలు అనుభవానికి వస్తాయి. వీటినించే అహంకారము పుడుతుంది. ఇది అంతా మాయా ప్రభావం అన్న విచక్షణా జ్ఞానం కలిగి, అహంకారాన్ని పారద్రోలే స్వభావము ఏర్పడుతుంది. 🌺 |