శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
200. సర్వమంగళా | ||
సర్వ శుభములు ఇచ్చేది.సకల శుభములు కలిగినట్టిది. తనను ఆశ్రయించిన భక్తులకు సకల శుభములు ఇచ్చును ఆ మంగళ ప్రధాయిని. "సర్వ మంగళ మంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబికె దేవి నారాయణి నమోస్తుతే" మంగళకరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ పార్వతీ, ఓ దుర్గాదేవీ, ఓ నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను 🙏 🌺స్వచ్చమైన మనస్సుతో, వివేకంతో కుడి చేసే ఏ పనైనా సర్వశుభకరం అవుతుంది.🌺 |