శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
194. దురాచారశామనీ | ||
దురాచారములనుంచి తపించునది. ఆ పరాభట్టారిక తన భక్తులను చెడు ఆచారాలను(కర్మలను ) చేయ్యకుండా బుద్ధికి జ్ఞానము ప్రసాదించుతుంది. అమ్మవారు సదాచారము, దురాచారము రెండుయు సృష్టించింది తానెయైనా , సదాచారములో వున్న భక్తులు అంటే ప్రీతి. సదాచారము పాటించే భక్తుల బుద్ధికి జ్ఞ్యానం ప్రసాదించి, మనస్సు ద్వారా దురాచారపనులను చేయ్య వద్దు అని హెచ్చరిస్తుంది. భక్తులలో దురాచారము పోగొడుతుంది. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏 🌺సదా అమ్మవారి నామ పారాయణముతో, దుష్టభావాలు మనలో ప్రవేశించే తావులేదు. మాయా, కలిప్రభావం వలన, అటువంటి భావాలు కలిగినా, అమ్మవారి యుక్క నామ మహిమ వల్ల వాటికి లోనుకాము 🌺 |