శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
179. భేదనాశినీ | ||
భేదాన్ని నాశనంచేసేది. మమతా, అనురాగాలు, కామ, క్రోధ, ఈర్షా వంటి మాయా రూపాలను నాశనం చేసేది. సకలజనులకు పరబ్రహ్మ స్వరూపమై ఈ బ్రహ్మాండమునకు ఆదిదేవతగా వుంటూ, తనను ఆశ్రయించిన భక్తుల మనస్సు నందు గల భేదభావములను జ్ఞానము చేత నశింపజేసి, జీవాత్మ -పరమాత్మ ఏకమైనన్న భావన కలుగజేస్తుంది. భక్తులలో భేద బుధుని నశింపజేసే తల్లికి నమస్కారము 🙏 🌺భిన్న భావాలనుంచి, సంఘీభావములుగా మర్చి, ఏకత్వ భావమును ప్రోత్సహించగలుగుతాము. భేద అభిప్రాయాలను నిర్వీర్యం చేయగలుగుతాము 🌺 |