శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
106. సుధాసారాభి వర్షిణి | ||
పరంజ్యోతియుక్క వెలుగునే అమృతమని, సుధా అని అంటారు. సహస్రారం సర్వవర్ణోప శోభితమైనది. అదియే చంద్రమండలము. సుషుమ్న సహస్రారము చేరి సదాశివ తేజస్సుతో కలిసి ఒక్కటైనప్పుడు పైనున్న ద్వాదశాంతము, బ్రహ్మశీర్షములు వెలుగును లాగుచూ పైకి పోవును. ముఖ్యప్రాణము బ్రహ్మశీర్షమును తాకగానే సుధావర్షము సహస్రారముపై పడును. ఆ తల్లీ తన భక్తులకు అమృతత్వము కలిగించును. సాధకుడు నేను అనే బ్రాంతిని వదిలి పరమాత్మతో ఐక్యమునొంది జీవన్ముక్తుడగును🙏. 🌺మనసు నుండి భావములు అమృతధారవాలే పొంగుతాయి. మన బుద్ధి ని, మన ఆలోచలను సక్రమ మార్గము లో పెడుతూ, సర్వదా ఆ జగన్మాతయుక్క కృప, కటాక్ష, వీక్షణలు మనపై వుంటాయి🌺 |