శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
199. సర్వశక్తిమయీ | ||
జగదంబ సర్వశక్తిమయీ. *సర్వం శక్తిమయం జగత్.* సర్వశక్తులకు అది దేవత... ఈ జగత్తునందు అన్ని శక్తి స్వరూపములు ఏవైతే యున్నయో,..ఆశక్తిలన్నీ శక్తిస్వరూపిణి అయిన దేవి యుక్క శక్తులే. అందుకనే ఆ దేవి సర్వశక్తిమయీ. మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రయాలలో ఆ పరా శక్తి అన్ని క్రియలు చేయిస్తుంది. రెండు చేతులు జోడించ్చి నమస్కరించాలి అంటే, మన జ్ఞానేంద్రియాల సంకేతనముతో మన కర్మేంద్రయాలు భగవంతుడికి చేతులు జోడించ్చి నమస్కరించగలుగుతాయి . ఆ శక్తి మనలో వున్నది కాబట్టి ఆ క్రియ చేయగలిగాము, లేనిచో అశక్తులమై అనారోగ్య పాలవుతాము. మనలో ఆ శక్తి ప్రకాశిస్తూ వుండాలి అంటే భగవన్నామ స్మరణ ఎల్లపుడు మన అంతర్యాగములో జరుగుతువుండాలి. అప్పుడు ఏ దుష్టశక్తి మనలో ప్రవేశించదు. అంతటి ఆ సర్వశక్తిమయీ తల్లికి నమస్కారము 🙏. 🌺నిరంతరమూ సద్భావంతో, సత్సంకల్పంతో ధర్మమార్గములో నడిచే వారికి తనకుతానుగా, గొప్ప శక్తిమంతులు అవుతారు. అంటువంటివారిని అనుకరిస్తూ ఇతరులెందరో ఆ శక్తి కూటమిలో చేరి మహాశక్తిగా ప్రకాశిస్తారు.🌺 |