శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
121. భయాపహా | ||
ద్వైతప్రవృత్తియే భయా. అదియే మాయా. ఆ మాయాస్వరూపిణి దృక్ -దృశ్యములు అన్ని ఆడించి చివరకు లయమునందు అభయము ఇచ్చునది, బ్రహణి అని అర్ధం. భయము, భ్రాంతి వలన కలుగుతుంది. భ్రాంతి ద్వైతభావన వలన కలుగును. ద్వైతభావమే జీవులను పశుప్రాయంగా చేయుచున్నది. భయము అనేక భావములచే వచ్చును. ఈతిబాధలు, మృత్యుభయము లన్నియు ఆధిభౌతికములు. భయము జీవ సంస్కారము. అభయము ద్వైతసంస్కారము. మాయా వున్నతవరకు, స్వపర భేదమున్నతవరకు జీవికి భయమే. ద్వైతమునందు విశ్వాసము వుంచుటచేత బ్రహ్మమార్గ ప్రయాణము. మాయను తొలగించు దేవి ఉపాసనమే భయాపహా అని రహస్యం. అన్ని భయాలను పోగెట్టే తల్లికి నమస్కారము 🙏 🌺సతభావంతో, భక్తి తో అమ్మని వేడుకుంటే, ఆ భయము అనేది పోతుంది. మాయా తొలగి, ఏది సత్యం ఏది అసత్యం అన్నది తెలుసుకొని బ్రహ్మా మార్గము వైపు ప్రయాణము సాగిస్తాము. 🌺 |