శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
107. తటిల్లతా సమరచి | ||
*తటిత* : అంటే మెరుపు. ఆ మెరుపు సుషుమ్న యుక్క ఆకృతి. *లత* : ప్రస్థానం చేసేటపుడు సుషుమ్న లత వలే సాగుతుంది. చక్రములన్నిటిని కాంతితో నింపుతుంది. *సమరచి* : అన్ని చక్రముయందు తగిన చైతన్యమును ఇచ్చేది కాబట్టి దానికి సమరుచి అని పేరు. మెరుపుతీగవంటి కాంతి కలది. ఇడ, పింగళ, సుషుమ్న నాడులు జడవలె అల్లుకుని వుంటాయి. ఇడ, పింగళ నాడులు ధూమ్రవర్ణము, వాటి మధ్య సుషుమ్న తేజోనాడి. మిగిలిన రెండు పాంచభౌతిక శక్తియుతనాడులు. ఇడ, పింగళ నాడులు మనస్తత్వం చక్రమైన ఆజ్ఞాచక్రము వరకే ప్రస్థానము కలవి. కుడివైపు నాడి ఎడమవైపునకు, ఎడమవైపు నాడి కుడివైపునకు ఆజ్ఞా చక్రములో విడిపోతాయి. ఒక సుషుమ్నయే ముఖ్యప్రాణమై, ప్రత్యగాత్మయై, చిత్కళయై సహస్రారరముపైనవున్న బ్రహ్మ శీర్షమును చేరగలిగినట్టిది. అట్టి మెరుపుతీగ వల్లే కాంతివంతంగా ప్రకాశించు తల్లికి నమస్కారము🙏 🌺అమ్మవారి యుక్క కాంతి మనమీద ప్రకాశించి, మెరుపువలె శక్తి ఉత్పన్నమవుతుంది. మానసిక బలం విశ్వాసం పెరుగుతాయి🌺 |