మమకార రహితమైన ఆ జగన్మాత తన భక్తుల మనస్సు నందు మమకారము అన్న భావమును హరించి పరబ్రహ్మ గురించి జ్ఞానము ఇచ్చునది.
అమ్మవారు మంత్రస్వరూపిణి, నాదస్వరూపిణి, గురుస్వరూపిణి. ఆమె సంకల్పము వుంటేనే సాధకుడు ఆమె నామమును జపించగలడు. ఇచ్చేది ఆమెనే, మరి ఆ సమయము అయిపోయాక మన దగ్గరనుండి తీసుకొనిది ఆమెనే.
మనము మాయలో పడి ఈ శరీరము శాశ్వతం అని,ఈ దేహము, రక్త సంబంధము శాశ్వతము అని తలుస్తాము. మానను కార్య సిద్ధి పొందాక, నేను సాధించాను అన్న అహంకారము తో విర్రవీగుతాము. కానీ,...
సత్యము ఏమి అనగా, ఆ జగన్మాత మనచే ఆ కార్యాన్ని రూపందాల్చి అంటే సంకల్పం చేపించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తుంది. మనము తలుచుకుంటే ఏమియూ సాధ్యం కాదు. ఆ శక్తి కిరణాలు మనమీద పడాలి.
మనము చేసుకున్న కర్మములను బట్టి, సత్బుధి కలిగి,
అమ్మవారిని ప్రార్ధన చేస్తాం, ఆ ప్రార్థన శక్తి ద్వారా మనము కార్యమలో సిద్ధి పొందుతాము.
సంకల్పము ఆమెదే,..కార్యసిద్ధియు కూడా ఆమెనే.
మరి "నేను" అన్న అహంకారము, మమకారము ఎందుకు పెట్టుకోవాలి.
సర్వస్య శరణాగతి అని వేడుకుంటే మమతాహంత్రీ అయిన ఆ పరమేశ్వరిని చేరుకుంటాము.
మననుంచి నాది అన్న భావనను పోగొట్టే తల్లికి నమస్కారము 🙏
🌺నావాళ్లు, నాకోసం, అనే భావంతో కూడిన మమకారాన్ని కూడా ఆ పరమేశ్వరి వైపుకి మళ్ళించుకోగలుగుతాము 🌺
|