శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
175. భవనాశినీ | ||
ఇందులో 'భవము 'అనగా పుట్టుక అని అర్ధం. నాశిని అనగా నాశనము చేయునట్టిది అని అర్ధం. ద్వైత భావము వున్నవారికి మరల పుట్టుక అన్నది వుంటుంది. ద్వైత భావము అంటే నేను వేరు, దేవుడు వేరు, లోకము వేరు అన్న స్వపర భేదముచేత మరల జన్మకు కారణము ఏర్పడెను. ఇటువంటి భావము నశించినచో మరల జన్మ వుండదు. సంసార మనెడి మాయనుండి, తనను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తుంది ఆ జగతజనని. భక్తులను ఈ సంసార చక్రము (పుట్టుక, చావు )నుండి తప్పించు తల్లీకి నమస్కారము 🙏 🌺మనలో వుండే సంసార చక్రం(భవ సాగరం ) నుండి విముక్తులను చేస్తుంది ఈ నామము జపము వల్ల. 🌺 |