శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
113. భావనాగమ్యా | ||
మనయందు దృకరూపముగా కనిపించే సర్వ కాంతియు అమ్మవారి యుక్క భావమే. మనలో ఏర్పడిన శాంత మన: స్థితియే నిజమైన భాగ్యము. ఆ శాంత మన: స్థితి తురీయమునందు త్రిపుటి భంగము తరువాత కలుగుతుంది. దానినే భాగ్యము, సౌభాగ్యము అంటారు. ఉపాస్య దేవతముగా ఆమె శ్రీ చక్ర స్వరూపిణియై, విగ్రహ స్వరూపిణియై భావించుటకు, పూజించుటకు తగినరీతిగా మన ముందు వచ్చి కూర్చుంటుంది. కులచక్రములో కుండలిని వెళ్ళేటప్పుడు భావముతో కూడిన నాగముతో వచ్చిన మాయాస్వరూపిణి. అనగా తాను వెళ్ళేది అంధకారపదము. ఆ పధమును వెలిగించేది. మేల్కొని వున్నపుడు ఆమె తాను బ్రహ్మానని భావిస్తుంది. ఆజ్ఞా చక్రమునకు వెళ్ళినప్పుడు మాత్రమే తాను ఈశ్వర అని గ్రహిస్తుంది. అక్కడ వరకు కొంచెము, కొంచెము బ్రహ్మజ్ఞానము కలిగివుంటుంటి మంత్ర - యంత్రం, తంత్ర -విగ్రహాదులయందు బ్రాహ్మీభావన. అంటే భావనాతీత ధ్యానగమ్యా. ఒక సుషుమ్న చేత మాత్రమే చేరుకొనదగిన గమ్యము కలది. ధ్యానముచే సాక్షాత్కరించుకో గలిగిన తల్లికి నమస్కారము 🙏. 🌺ఆ అమ్మ రూపము ధ్యానము చేస్తే , మన మనసులో వున్న భావన రూపం దాల్చుతుంది. అందుకే పూజ చేసే టపుడు, మంచి సంకల్పము తో, స్వచ్చమైన మనస్సు తో , ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా పూజ /ధ్యానము చేయాలి. మన మనసులో వుండే భావన చెడు గా వుంటే, కీడు జరుగుతుంది. మంచిగా వుంటే, మంచి జరుగుతుంది.మన గమ్యాన్ని మనమే నిర్ణయించుకుంటాము. "యత భావం తత్ భవతి."🌺 |