శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
114. భవారణ్య కుఠారికా | ||
*భవ్య* : అందరి చేత పూజింపదగినట్టిది *కుఠారికా* : అనగా గొడ్డలి. చక్రఛేదనము చేయడము, పంచకోశ ఛేదనము చేయటము. త్రిపుటిభంగం చేయటం. ప్రాణాలను ముఖ్య ప్రాణంగా మార్చటం. గుణాలను ఛేదించి సత్యముగా చేయటం. ఇవన్నియు అమ్మవారకే సాధ్యం. అట్టి ఛేదన చేతనే అనేకతత్వముపోయి ఏకత్వం వస్తుంది. ఈ 'భావనారణ్యా : అంటే, ప్రకటగాయత్రీమంత్రము. కులమార్గమే భవారణ్యము. అదియే పద్మాటవీ. చక్రవేధ చేయుటయే కుఠారికాసంజ్ఞ. కులసుందరి అని అర్ధము. సంసారము అనే అరణ్యనికి గొడ్డలి వంటిదగు తల్లికి నమస్కారము 🙏 🌺 సంకల్పించిన భావాన్ని ఆచరణలో పెట్టె సమయములో ఎన్నో అవాంతారాలు, అడ్డుగోడలు, మన వల్ల, ఇతరుల వల్ల ప్రకృతి వల్ల కూడా జరగవచ్చు. అటువంటి వాటినుంచి తప్పించుకోగలుగుతాము. ఆ లలితాంబిక, తన భక్తులను ఈ సంసారములో వున్న దుఃఖభూయిష్టమైన వాటి నుండి, గొడ్డలి తో నశింపచేస్తుంది.. తరింపజేస్తుంది🌺 |