శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
184. నిస్తులా | ||
అమ్మవారి పోలికలు గాను పోల్చతగ్గ మరియొక్క శక్తి ఈ జగత్తు యందు ఏమియు లేదు. తులా రాసి కాల చక్రములో ఏడవ రాశి. పన్నెండు రాసుల మధ్య వున్న రాశి. శక్తి ఆ రాశి యందు వుండి ఆకాశమథ్యంలో సమస్త ప్రపంచము యుక్క ఆస్తిత్వాన్ని కాపాడుతూ వుంటుంది. అమ్మవారియుక్క ముఖ వర్చస్సు గాని, గుణగణాలు కానీ అతి విశేషమైనవి. వాటికి సాటి "అహం బ్రహ్మాస్మిన్" అన్న భావన వుంటేనే, వాటిని పొందగలము. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏 🌺ఉన్నతమైన గుణములు పొందగలుగుతాము. అమ్మాయుక్క వర్చస్సు మనముఖములో ప్రతిబింబిస్తూ వుంటుంది.🌺 |