శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
143. నిరుపప్లవా | ||
జన్మ స్థితి, వృద్ధి, పరిణామము, క్షయము, లయము ఇవి దృశ్య రూపము. ఇవియే ఉపప్లవ కారణములు. అట్టి స్థితికి అతీతమైనది నిరుపప్లవ. అకుల మార్గమునందు అనగా ఆజ్ఞాచక్రము పైనున్న చక్రములయందు సుషుమ్న సంచరించునప్పుడు నిరుపప్లవగా వుంటుంది. అంటే నాశరహితముగా వుంటుంది. కేవలం జ్ఞేయమైన బ్రహ్మమే తానుగా అద్వైత భావనతో నామరూప వివక్ష అన్న మాయా ప్రవృత్తిని విడనాడుతుంది కాబట్టి ఆమె నిరుపప్లవ. ఆ తల్లికి నమస్కారము🙏 🌺ధర్మ మార్గాన్ని ఎంచుకొన్నపుడు, మధ్యలో వచ్చే అడ్డంకులను పారద్రోలి, ముందు జాగ్రత్త పడే తత్వం అలవడుతుంది. ధర్మం పట్ల, ధర్మ కార్యాలపట్లా అమ్మవారు మన యందు నిరుపప్లవానికి అభ్యం ఇస్తుంది. అంటే ధర్మ కార్యానికి అడ్డంకులు రాకుండా, సంకల్పం నాశనం కాకుండా కాపాడుతుంది. "ధర్మో రక్షతి రక్షితః" 🌺 |