శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
132. నిరాధారా | ||
ఆధారముతో అవసరము లేనిది. తానే సర్వాధారకబట్టి. సర్వాధిష్టాన అయిన పరంజ్యోతి నిరాధార. సుషుమ్న స్వయంభూ జ్యోతి. జ్యోతిలన్నిటికి జ్యోతి. నిర్బీజధ్యానమే నిరాధార పూజ. ఇందు, మంత్ర -మంత్రి -అధిదైవత -పునః -ప్రాణ -చక్షువుల భేద ప్రతిపత్తి ఏమియు లేనిది. తాను దృక్ రూపమని, నశ్వరమని తెలియుట నిరాధారపూజ. తనలోని అనశ్వర ఆత్మజ్యోతి పూజని మౌనంగా ఆచరించటం ఆచరణయుక్క స్పృహ కూడా లేని ధ్యానము నిరాధార. సమస్త ప్రపంచానికి, జీవరాసులకు అధారమై, తను నిరాధారిగా స్వయంప్రకాష్ స్వరూపిణి అయిన ఆ తల్లికి నమస్కారము 🙏 🌺 క్రమక్రమంగా ఎవరిమీద ఆధారపడకుండా,మన శక్తిని గుర్తించి, దానిని సద్వినియోగం చేసుకోగలిగే తత్వం ఏర్పడుతుంది. నిరాధారి అయిన ఆ తల్లీ మనకి అండగా వుంటుంది. 🌺 |