శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
147. నిరాశ్రయా | ||
ఆశ్రయము ఏదియూ అవసరము లేనట్టిది, తానే సర్వమునకూ ఆశ్రయమైనది. దృక్ దృశ్య రూపములకు అతీతమైనది నిరాశ్రయ. దృక్ దృశ్యాలు మీదనే ఆధారపడిన భావనా రూపము కనుక అదియూ ప్రాణముతో పాటు నశించునదే. దృశ్యములో నశ్య పరిణామములు 7 విధములు. అనిత్య, అసత్య, జడము, పరిచ్చినము, దుఃఖ రూపము, పౌరషేయము, పరాధీనము. దృక్ రూపము దీనికి విరోధము. అది కొంత వరకు నిత్యము, సత్యము, జ్ఞానము, అపరిచ్చిన్నము, ఆనందము, అపౌరుషేయము, సతః ప్రమాణము అన్న రీతిగా వుంటుంది. ఈ విభజనము బహిర్యాగ అంతర్యాగముల వరకే పరిమితము. ఆపైన దృక్ దృశ్యములతో పని లేదు. రహోయాగంలో దృక్ దృశ్య అతీత స్థితికి వెళ్లవలెను. అనగా భావనాతీత లక్షణం. అప్పుడే జ్యోతి స్వయంజ్యోతి అవుతుంది. ఆ స్వయంజ్యోతి నిరాశ్రయ. సర్వానికి తాను ఆశ్రయమైన తల్లికి నమస్కారము 🙏 🌺మన వ్యక్తిత్వాన్ని, సమర్థతను పెంచుకోగలము. అమ్మ ఆశ్రయముతో అన్ని సాధించగలము. 🌺 |