శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
145. నిర్వికారా | ||
అనగా షద్భావ వికారము లేనిది. పరిణామ హేతువై పరిణామములకు అతీతమైనది. ఆకారములేని పరంజ్యోతికి విక్రములుండవు. హర్షము, ఈర్ష, ద్వేషము, భయము వంటి వికారములు వల్ల,... పుట్టుట, పెరుగుట, పరిణామము చెందుట చివరకు దుఖఃమునకు లోనగుట, ఇవి లేనట్టిది అమ్మవారు. ఆమె పరంజ్యోతి. ఎటువంటి మార్పు లేకుండా, చిదానంద స్వభావము తో ప్రకాశించే తల్లికి నమస్కారము 🙏. 🌺ఏ విధమైన బావ వికారాలు మన చేపట్టిన కార్యమునకు అడ్డంకులు కావు. మనలో జరిగే భౌతికపరమైన మార్పులకు అనుగుణంగా ప్రవర్తించగలిగే శక్తి, వివేకం కలుగుతాయి 🌺 |