శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
152. నిష్కారణా | ||
మూలకారణ ప్రకృతియే కార్యకారణ నామరూప జగత్తునకు జనని. ఈశ్వర సంకల్పమే పరిణామ కారణమైన ఈ దృశ్య జగత్తు. సంకల్పమే భావనకు పునాది. భావననుండి కార్యకారణములు పుట్టును. దానినుండి ద్వందానుభూతి, దానినుండి పరిణామము. ఈ పరిణామము భౌతిక జగత్తు యుక్క ధర్మము. దీనిని అలోకిక ధర్మము అంటారు. అంటే అంతర్గత విచారము, పరిశోధన. అదే ధర్మాద్వైత స్థితి. అదే నిర్వాణం. అదే పరాపూజ. సహస్రారం వరకు ధర్మాద్వైత స్థితిలో సుషుమ్న పయనింస్తుంది. ఆపైన మహాయాగ క్రమంలో అద్వైత స్థితి. దాని పేరే నిష్కరణ. ఏ కారణాలు తనకి అంటవు. సర్వ కారణములకు అతీతంగా వుండే తల్లికి నమస్కారము 🙏 🌺కారణాలకోసం కాకుండా ఇది నాధర్మము అనే ప్రవృత్తితో కార్యం చేసే ఆలోచన అలవడుతుంది. 🌺 |