శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
192. సుఖప్రదా | ||
సుఖమును ఇచ్చునది. సర్వావస్థలయందు తన నామమును భక్తి శ్రద్ధలతో జపం చేసేవారికి, సుఖఃములను ఇచ్చు భక్త వరదాయిని ఆ లలితా పరమేశ్వరి. మానవుడికి, లోకిక వస్తువుల నుండి సంప్రాప్తిచే సుఖము, కొద్ది క్షణాలు మాత్రమే తనతో వుండును. మరికాసేపటికి లేకుండా మాయమగుతుంది. రహోయాగములో సుషుమ్న, బ్రహ్మణినాడిలో ఉర్ధ్వముగా పయనించే టప్పుడు, ఆ అనుభూతి సుఖప్రధా. ఈ సుఖము శాశ్వతము. భగవంతుని లీలా గానములు చేస్తున్నప్పుడు కలిగే సంతోషమే శాశ్వతము. అదియే సుఖ ప్రదా. సర్వ సుఖములను ప్రసాదించే తల్లి కి నమస్కారము 🙏 🌺తోటి మానవుడికి కలిగిన సుఖము తన సుఖముగా భావింఛి ఆనందం పంచుకోగలుగుతాము. అదే భావన దుఃఖము కలిగినప్పుడు, తన దుఃఖముగా భావించి, వారికి ధైర్య వచనములు పలకగలుగుతాము.🌺 |