శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
146. నిష్ప్రపంచా | ||
సుషుప్తిలో ప్రాజ్ఞరూప ముఖ్యప్రాణమునకు ప్రపంచ త్రిపుటి లేదు . అనగా జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అన్న త్రిపుటి లేదు. ప్రపంచాధిష్టాత్రియైన పరమేశ్వరిలో ప్రపంచము లేదు. ప్రపంచమునకే ఆమె మూల కారణము కాబట్టి. ప్రపంచమంతటనూ పరమేశ్వరి నిండివున్నది. ఆమెకు వేరే ప్రపంచము లేదు. ఆమె సర్వాతర్యామిని. బ్రహ్మాడాలకు అతీతంగా తేజరిల్లు తల్లికి నమస్కారము 🙏 🌺ఈ ప్రపంచంలో మనమీద పడే ఇంద్రియ ప్రభావాలను, మనల్ని కదలించకుండా, సడలించకుండా వుండగలిగే తత్వం ఏర్పడుతుంది. అందరిలాగా వుంటూనే, మనకి మనంగా వుండగలిగే శక్తి కలుగుతుంది. 🌺 |