శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
118. భక్తప్రియా | ||
భక్తులయందు ప్రియముకలది. భక్తుల పాలిట కల్పవృక్షము. ఇక్కడ భక్త అంటే యోగి అని అర్ధం. ఆత్మ పరమాత్మలను భక్తిచేతకాని, వైరాగ్యము చేతగాని , జ్ఞానము చేతగాని, ఏకము చేయటమే యోగము. ఈ భక్తి, జ్ఞాన, వైరాగ్యములన్ని చివరకు ప్రాణముతో ముడిపడివుంటాయి కాబట్టి, ప్రాణముతోనే దానిని సాధించవలెను. 🌺సతప్రవర్తన, సదాలోచన తో ఈ యోగ సాధన సాధ్యం అవుతుంది. భక్తివైపు సమదృష్టి వైవు మనస్సు ఇష్టపడుతుంది. అటువంటి భక్తి కలిగిన వారియందు ప్రీతి ఏర్పడుతుంది.🌺 |