శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
196. సర్వజ్ఞా | ||
అన్నియూ తానై, తెలియుట. సర్వమూ తానై నిండిన పరాశక్తికి తెలియదగిన వేరొక వస్తువు లేదు. అన్నియూ తన ఆధినమందే కలది. కావున ఆమె సర్వజ్ఞా. సమస్త విషయములందు జ్ఞానమును కలిగినటువంటిది. భక్తుల మనసులో ఏమి వున్నది అని కూడా ఆమెకు తెలుసు. అందుకే భక్తి భావనతో ఎవరైతే ఆ పరాశక్తిని పూజిస్తారో , వారి కోరికలను తీర్చుతుంది. అట్టి సర్వము తానై, అన్నియూ తెలిసివున్న తల్లికి నమస్కారము 🙏 🌺ఈ భూ ప్రపంచములో ఎన్నో తెలుసుకోవలసిన విశయాలు వున్నవి. వాటిని నేర్చుకోవాలని జిగ్యాస కలిగి వుంటాము. దానివల్ల అమ్మవారి ఆశీసులతో సర్వమును తెలుసు కోడానికి ప్రయత్నం మొదలుపెడతాము 🌺 |