శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
108. షట్చక్రోపరి సంస్థితా | ||
బిందువులకంటే కూడా ఆమె పరబిందువు కాబట్టి ఆమె చక్రస్వరూపిణి. మూలాధారము, స్వాధిష్ఠానము,, మణిపుర, దహర, విశుద్ధ, ఆజ్ఞాచక్రములు కులమార్గము నందలి షట్చక్రములు. ఈ ఆరు చక్రాలను దాటి సహస్రారచక్రములో ఆ తల్లీ భాసిల్లుతోంది. అందు పరిపూర్ణముగా వ్యక్తమగు శ్రీమాతకు నమస్కారము🙏 🌺బుద్ధివికాసము, సాధనాపరిపక్వత, నిర్దిష్టమైన ఆలోచన ధోరణి, సమాయకులంగా ప్రవర్తించగలిగే సామర్ధ్యమును పొందడానికి శరీరం, మనస్సు సంపూర్ణముగా ద్యేయం వైపే ప్రయాణిస్తాయి 🌺 |