శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
101. మణిపూరాంతరుదితా | ||
*ఉదిత* : ఉదయించునది. తనను తాను తెలుసుకొనుటయే. ఇడ -పింగళ -సుషుమ్న మధ్య జాడగా అల్లుకొని మణిపురమునకు వెళ్లి తాను బ్రహ్మణి అని తెలుసుకుంటుంది. అదియే నిజమైన ఉదయం /ఉదిత. *మణిపూర* : అంతర్యాగములో అమ్మవారుని మణితో కూడినటువంటి ఆభరణాలన్నిటిని అలంకరించి పూజ చేస్తున్నట్టుగా, మణిపురచక్రమునందు భావన చేసుకొని పూజ చెయ్యాలి. కుండలిని జన్మ స్థానము మూలాధారమైనట్లు ఆమెయుక్క నాదస్వరూప జన్మస్థానము మణిపురమవుతుంది. నాదస్వరూపమే తేజస్వరూపము అని కూడా తెలుసుకోవాలి. *తారాంతర ఉదిత* : ఆమె నాదస్వరూపిణి కాబట్టి ప్రణవముయుక్క చిట్టచివరి అంటే అకార, ఉకార, మకార, అర్ధచంద్ర, బిందు వులలో బిందుస్థానము 'తారా' అంటారు. ఓంకారము అందరు చెపుతారు. కానీ 'అ' కారముతో మొదలుపెట్టి 'ఉ' కారము 'మ'కారము, అర్ధచంద్రు ని దగ్గర బింధువు ని ధ్యానము చేస్తే అది పరిపూర్ణమైన ధ్యానం అవుతుంది. అపుడే జ్యోతి దర్శనము కలుగుతుంది. నాభి యందున్న మణిపూర చక్రంలో బాసిల్లు తల్లికి నమస్కారము🙏 🌺నాభి స్థానము యందు కేంద్రీకృతమైన తల్లిని ధ్యానము చేస్తూ, బుద్ధితో, వివేకంతో ఆత్మ దర్శనము చేయటం మొదలుపెట్టాలి. మనకి కావలసిన శక్తి , సామర్ధ్యం అమ్మ చూపెడుతుంది🌺 |