శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
110. కుండలినీ | ||
*కులిని* : కులచక్రముల యందు సంచరించెడి ఇడ, పింగళతో కూడిన సుషుమ్నను కులిని, కులయోష, కులమార్గగామిని, కులసుందరి అన్న నామములతో పిలుస్తారు. *నీలిని* :ఆమె ఆజ్ఞాచక్రము దగ్గరకు వచ్చునప్పుడు ఆ జీవి యుక్క అహం స్వరూపమంతా నీలాకారముగా కనిపిస్తుంది. సార్ధత్రివాలయమై మూలాధారమున స్వపితమై వుండునది కుండలిని. మూలాధారమందు చుట్ట చుట్టుకున్న సర్పాకారంతో కుండలినీ శక్తిగా తేజరిల్లు తల్లికి నమస్కారము 🙏 🌺అమ్మాయుక్క తత్వము గురించి పూర్తి అవగాహన వున్న వ్యక్తులతో, సత్సంగ్యత్వం చేస్తాము. 🌺 |