శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
129. శరచ్చంద్ర నిభాననా | ||
శరత్కాలపు చంద్రని తో తులతూగునట్టి ముఖముకల అమ్మవారు. అంతర్యాగ, రహోయాగములలో రోధిని చక్రము దగ్గర నిలచిన రెండు లిప్తల్లో నుదురు శిరస్సు చిదాకాశంగా మారుతుంది. సర్వము కాంతి ఆకాశమువలె అవుతుంది. అప్పుడు సుషుమ్న శరచ్చంద్రనిభానన అయి ఉన్మనీ చక్రమునకు పరుగుతీస్తుంది. అనగా శబ్దంచేత రోధినిలో సుషుమ్నకు బ్రహ్మరూపజ్ఞానం పూర్తవుతుంది. ఈ నామమ లో వున్న విశ్లేషణ రహస్యం. శాంభవి విద్యలో ఇది ఎనిమిదవ మెట్టు. 🙏 🌺 శుభలక్షణాలతో నిండివుంటాము. ఆ లక్షణాలు చల్లని కిరణాలు వలే మనమీద పడి, చంద్రుని ముఖములాగా ఆహ్లాదంగా వుంటాము🌺 |