శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
156. నీరాగా | ||
రాగ రహిత్యే నిరాగ. అనగా సంగ రహిత. కాంక్ష సాఫల్యము రెండు తానే కావున తనకు వేరొక కాంక్ష లేదు. పొందవలసిందేదీ లేనిది నిరాగ. కోర్కెలు లేనిది నిరాగ. రహోయాగములో అకుల మార్గములో సుషుమ్న ఇడ పింగళలయందు రాగము లేని దగును. ఆజ్ఞాచక్రము వరకు సుషుమ్న రాగా, ఆపైన అకుల మార్గములో అది నిరాగ. సర్వానికి అతీతమైన తల్లికి నమస్కారము 🙏 🌺భౌతికమైన, తాత్కాలికమైన వాంఛలు లేని తత్వం అలవడుతుంది. 🌺 |