శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
169. క్రోధశమనీ | ||
కోపమును శమింపచేయునది. తనను ఆశ్రయించు భకుల యందు కల క్రోధమును శమింపజేయునది. సహస్రారమును చేరిన ముఖ్య ప్రాణము క్రోధశమని. కోపం వచ్చినప్పుడు ఒకటి రెండు అని ఒకటికి పది సార్లు లెక్కబెట్టమంటారు మనవాళు. ఎందుకంటే తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవడం కోసం. తన కోపమే తన శత్రువు అని సుమతీ శతకం కూడా చెబుతుంది. మన ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ఇంద్రియాలకు ప్రధానం మనస్సు. మానవుడు మనస్సును నిగ్రహించి ధైర్యమనే పగ్గాల తో ఇంద్రియములు అనే గుర్రాలను అదుపులోపెడుతూ, మోక్షం అనే మార్గం వైపు పయనించాలి. ఈరీత్యా క్రోధశమని కి అర్ధం తెలుసుకోగలుగుతాము. క్రోధాన్ని శమింపచేసే తల్లికి నమస్కారము 🙏 🌺 కోపం వచ్చే సందర్భాలు వచ్చినప్పుడు, మన ఇంద్రియాలను నియంత్రించుకొని, ఆ సందర్భాన్ని కూడా గమ్యం కొసం ఉపయోగించుకోగలిగే వివేకం, శాంతం ఏర్పడుతుంది 🌺 |