శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
171. లోభనాశినీ | ||
లోభ గుణాలను నాశనం చేయు నట్టిది. తననుతాను హింసించుకొని ఈ సృష్టిని పుట్టిస్తుంది ఆ జగన్మాత. మరల ఈ సృష్టి ద్వారానే తన యుక్క అంశాన్ని పూర్ణం చేసుకుంటుంది రాజరాజేశ్వరిగా. ఎట్లా ఐతే తల్లీ ప్రసవ వేదన పడుతూ, తన శరీరం విచ్చిన్నం చేసి బిడ్డను కంటుందో,మరల ఆ బిడ్డ ను చూసి *అమ్మ* అన్న పూర్ణత్వం పొందుతుంది. ఆ సమయములో తను ఏమైనా పరవాలేదు, తన బిడ్డ క్షేమం గా వుండాలి అని కోరుకుంతుంది . అటువంటిది ఈ లోభ నాశిని. అటులనే ప్రతి జీవుడు లోక క్షేమంకోసం తన వంతు గా ధర్మబోధన చేస్తూ, అరిషట్ వర్గాలను (మనలో వుండే శ్రత్రువులు కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యం) జయించాలి. తనని నమ్మిన భక్తులలో వుండే లోభగుణములనించి విముక్తి చేస్తుంది ఆ పరాత్పరి లలితా పరమేశ్వరి. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏 🌺లోభగుణమునించి, మనలో ఇతర చెడు గుణాలు ప్రభావితం కాకుండా కాపాడుకోగలుగుతాము 🌺 |