శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
198. సమానాధిక వర్జితా | ||
సమాన, అధిక రెండు వర్జింపబడినవి ఆ దేవితో సమానమైనది గాని అధికమైన శక్తి గాని ఈ జగత్తు నందు లేదు. తనతో సమానమైన వారు, అధికులైన వారు లేనిది. మానవ నాడి మండలంలో సుషుమ్నా లక్షణము సమాన. ధ్యాన చక్రము ఆజ్ఞకుంభకమైనప్పుడు శ్వాస దాదాపు శున్యకస్థితిని చేరుతుంది. అప్పుడు శ్వాస వున్నదా లేదా అన్న స్థితి కలుగుతుంది. ఆజ్ఞాచక్రమును చేరినప్పుడు సుషుమ్న సమానాధిక వర్జితా. సమాన, అధిక అన్న రెండు పదాలు కులమార్గములో ప్రాణప్రయాణాన్ని తెలుపుతాయి. మనలో ఈ ప్రక్రియని నడిపింఛి, తనతో సమాన, అధికులు ఎవ్వరు లేరు అన్న విషయాన్నీ నిరూపించిన తల్లికి నమస్కారము 🙏 🌺నాకంటే అధికులు, నాకంటే తక్కువ అన్న భేద భావాలు నశిస్తాయి. అన్నిటిలో,అందరిలో శుభత్వాన్ని చూసే తత్వం ఏర్పడుతుంది.🌺 |