శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
139. నిర్గుణా | ||
అఖండము నిర్గుణము. గుణములను కల్పించు మూలపాతార్ధము నిర్గుణము. గుణములు అన్నియు తనలో ఏ విధమైన ప్రభావం కలిగించుకోకుండా వుంటుంది. బాధ-సంతోషం, కోపం- శాతం, అన్నిటికి ఒకటే గుణం నిర్గుణ తత్వం. చిద్విలాస తత్వం. సత్వ, రజః, తమో గుణాలకు అతీతంగా వున్నది. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺చేసే పనిని బట్టి, తిరిగే వాతావరణం, మనుష్యులను బట్టి, సమయానుకూలంగా వ్యవహరించినప్పటికీ మన మూలతత్వమును ఏ ఇతర గుణములు ప్రభావితం చేయకుండా నిశ్చలంగా వుండగలుగుతాము. 🌺 |