శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
128. సాధ్వి | ||
సాధ్వి అంటే పవిత్రత అని సామాన్య అర్ధం. శ్రీవిద్యలో అమ్మవారిపరంగా అంతర్యాగమంలో ఆజ్ఞాచక్రాన్ని దాటిన ముఖ్యప్రాణం అనబడే సుషుమ్న రోధిని చక్రం చేరేవరకు సాధ్వి నామంతో పిలవబడుతుంది. "అయమాత్మ బ్రహ్మ " అన్న స్థితి అది. ఇది శాంభవీ విద్యలో ఏడవ మెట్టు. పవిత్రత భావాన్ని కోరుకునే తల్లికి నమస్కారము 🙏 🌺సాదు స్వభావము అలవడుతుంది. దాని ద్వారా మన ప్రవర్తన, ఆలోచనా విధానము మారి సంఘంలో ఆదరింపబడుతాము 🌺 |