శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
174. నిర్భవా | ||
ఈ సృష్టిలో జీవరాసుల పుట్టుకకు కారణమై, తనకు ఏ పుట్టుకా లేనిది ఏదో అదే నిర్భవా. సత్యజ్ఞానమే పునర్జన్మ లేకుండా చేయునది. ఈ వరము, పరమేశ్వరి తన యందు భక్తి విశ్వాసం వున్నా వారికి కృప కలిగిస్తుంది. ఈ బ్రహ్మాండమునకు మూలకారణమైన ఆ తల్లియే నిర్భవా. భవ రహితురాలైన ఆ తల్లికి నమస్కారము 🙏 🌺మనలో వుండే అజ్ఞానాన్ని పోగొట్టి, జ్ఞానజ్యోతిని, చైతన్యము ప్రసాదిస్తుంది . సత్య జ్ఞానాన్ని బోధిస్తుంది ఆ తల్లీ. 🌺 |