శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
136. నిత్యా | ||
సర్వవేళలయందు, సర్వమునందు వుండునది నిత్యా. నిత్యము, సత్యము పరబ్రహ్మ స్వరూపిణి. సమస్తమునందు వుండుటచేత సజాతీయభేదము లేదు. అంగ, అంగీ భేదము లేనిది నిత్యా. చంద్రకళావిద్యలో శుద్ధపాడ్యమి నుండి అమావాస్య వరకు గల తిధులకు నిత్య అని పేరు. సర్వకాల, సర్వావస్థలయందు భాసిల్లే శాశ్వతస్వరూపిణి అయిన తల్లికి నమస్కారము 🙏 🌺కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనస్సు, బుద్ధి, చెదిరిపోకుండా ఎల్లపుడు లక్ష్యం వైపు, మూలపదార్ధం వైపు స్థిరంగా వుండగలుగుతాము. 🌺 |