శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
151. నిరంతరా | ||
సర్వము తానైనది కనుక నిరంతర. " పూర్ణమద: పూర్ణమిదం". అంతరము లేనిది. పూర్ణమూ తానే కనుక అంతరము లేనిది. సర్వాంతర్యామి లక్షణము చేత పరమాత్మకు బాహ్యాభ్యంతరములు సామాన్య వస్తువునకే కానీ బ్రహ్మ వస్తువునకు లేవు. కావున నిరంతర. పరమాత్మ అనంతత్వ, నిత్యత్వ, సత్యత్వ లక్షణములచేత దేశకాల చైతన్యములకు అతీతము. సుధాధార ప్లావనం 72 వేల నాడీ సముదాయాలోనూ, సర్వాణువుల్లోనూ నిండినప్పుడు ధ్యానికి "సర్వం ఖల్విదం బ్రహ్మ " అన్న సమాధి స్థితి వస్తుంది. ఆ నిర్వాణ స్థితే యే నిరంతర. శాశ్వతమైన, అఖండమైన స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము 🙏 🌺మన కార్య సిద్ధి కొసం సర్వం, అనంతం బ్రహ్మ అన్న భావన తో చేయగలుగుతాము. కార్య సిద్ధి అవుతుంది. శ్రద్ధ, భక్తి, కార్యాచరణ దృష్టి కలుగుతాయి. 🌺 |