శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
183. నిష్పరిగ్రహా | ||
ఈ బ్రహ్మానడంలో వున్నా వన్నీ ఆ లలితా పరమేశ్వరి యుక్క సృష్టియే. అన్నియు తానే, ప్రతి పుట్టుకా తానే. అందునా ఆమెకి ప్రత్యేకించి ఇచ్చేది వుండదు, ఆమె పుచ్చుకునేది వుండదు. సర్వ లోకాలలో ఉన్నదంతా ఆమె విభూతియే కనుక ఆమె నిష్పరిగ్రహా.ఆ తల్లీ కి నమస్కారము 🙏 🌺మనది కానిదానికోసం మనస్సు వేంపర్లాడదు. మన ధర్మాన్ని పాటించుకుంటూ వెళ్లడం, తత్ ద్వారా వచ్చే ఫలితాన్ని భగవత్ నిర్ణయంగా భావించగలం🌺 |