మదన : అంటే సదాశివుడు. నాదస్వరూపిణి. నామరూపాత్మక జ్ఞానం పూర్తిగా నశింపనంతవరకు అది మదమే. అనగా అహంమే.
మన ప్రవృత్తిలో, పంచకోశములు
అనగా,..
1)అన్నమయము 2)ప్రాణమయము 3)మనోమయము 4)విఙ్ఞానమయము 5)ఆనందమయము అనెడి కోశములు (పరమాత్మను కనబడనీయక కప్పుకొనినట్లు ఉండునవి)
అవి పూర్తిగా మాసిపోయేంతవరకు మనలో మదము (అహం )వున్నట్టే.
నాకు ద్వేషము లేదు, రాగము లేదు, నాకు లోభము లేదు,మోహము లేదు, నాకు మదము కానీ, మాత్సర్యము కానీ లేవు, నాకు ధర్మము, అర్ధము, కామము, మోక్షము లేవు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! అనగా నాకు ఏ ద్వంద్వములూ లేవు, నాకు యే
పురుషార్ధములూ లేవు..ఎందుకనగా..నేను భౌతిక శరీరాన్ని కలిగిన మానవుడిని కాను కనుక,
నేను సాక్షాత్తూ శివుడను కనుక, మానవ సహజమైన మంచి చెడులకు అతీతుడను కనుక!
అన్న భావన మనలో కలిగినప్పుడే
, ముఖ్య ప్రాణము ఊర్ధ్వగమనముతో సహస్రార బ్రహ్మశీర్షములను చేరును.
అట్టి ముఖ్యప్రణామాతృకయైన ఉదానవాయువే మదనాశిని.
అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏
🌺మన ఈ సంసారం మార్గ మధ్యలో మన చేసే కర్మములను బట్టి ,కొన్ని అజ్ఞాన పూరితమైన బలహీనతలు (కామం, క్రోధం, గర్వం ఇధ్యతి )ప్రవేశించడం జరిగితే, అమ్మవారు, ఆ జగన్మాత కృపతో వాటిని అధిగమించగలము 🌺
|