శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
135. నిర్మలా | ||
మలరహితమైనది నిర్మల. అంటే మచ్చ లేనిది.స్వచ్చత భావన కలిగినది. అమ్మవారి మహాస్మయస్వసృపమే అవిద్య. మల అంటే అపవిత్రత, చీకటి, అజ్ఞానం. మల లేనిదే నిర్మల. ఉపాధియుక్త ఆత్మయే నిర్మల. మల అన్నది బుద్ధిని చెడు ప్రేరేపనికి ప్రోత్సహిస్తుంది. అజ్ఞానం వల్ల. ఆత్మ శుద్ధి లేని వల్ల. నేను అన్న అహంకారం వల్ల. ఇవి పతనానికి దారి తెస్తాయి. ఎటువంటి మలని అంటించుకోకుండా వుండేదే నిర్మల. ఆ తల్లికి నమస్కారము 🙏. 🌺నేను అన్న అహంకారం విడిచిపెడితే, ఈ నామము యుక్క ఫలితము దక్కుతుంది. ఆత్మజ్ఞానం కలుగుతుంది. చీకటి లోనించి వెల్తురు అన్న ఆత్మ జ్యోతి ని చూడగలుగుతాము. అమ్మాయుక్క పాద సేవ, స్మరణం, సంకీర్తనం వల్ల ఈ చీకటి ని పోగొడతాము.' *నేను* ' అన్నదానిమీద ఒక స్పష్టత కలుగుతుంది 🌺 |