శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
163. మోహనాశినీ | ||
మొహాన్ని నాశనం చేసేది. తేజశ్చక్రములో, ఆకులమార్గమున ప్రయాణించే సుషుమ్న అనబడే ముఖ్యప్రాణమే మోహనాశిని. దేహమునందు గల మోహమును నశింపజేసే పరబ్రహ్మ తత్వం ఒక్కటే శాస్వతము. ఈ తత్వం వల్లనే బ్రహ్మానందం, బ్రహ్మజ్ఞానమును కలుగుతుంది. ద్వైత బుద్ధిని, మొహాన్ని నాశనంచేసే తల్లికి నమస్కారములు 🙏 🌺ఏ పరిస్థితులలోనైనా మొహానికి జారిపడుతుంటే మనలోని శక్తి ఆ ప్రమాదం నుంచి కాపాడుతుంది 🌺 |