శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
112. భవాని | ||
భవాని అంటే భవునుయుక్క పట్టపురాణి. తేజస్సు, నాదస్వరూపము. నాదమే తేజేశ్వరూపముగా అయిన పరాశక్తి. అఖిలాండకోటి బ్రహ్మాండమే ఆమె భవనము. దాని యజమానురాలు కాబట్టి ఆమెయే భవాని. భవాని, భువనేశ్వరి, హ్రి0కారాసన ఇధ్యతి నామములన్ని అమ్మవారియుక్క ఇచ్చా జగదిష్ఠాత్రి లక్షణాన్ని చెబుతాయి. భవనమే ఈ శ్రీచక్రము. అందు బిన్దుస్వరూపిణిగా వుండునది భవాని. బిందువే భవాని. భావుడైన శివుని పత్నిగా 'భవాని' నామముచే ప్రసిద్దమైన తల్లికి నమస్కారము 🙏 🌺ఆ భవాని మన భవనం అంటే మన శరీరము లో నిత్య నివాసం ఉండాలి అంటే ఆ జగన్మాత యుక్క లక్షణాలు(నిగర్వి, నిష్క్రోధా, శాంతా, తేజోమయి ) మనసా, వాచా, కర్మణా త్రికర్ణ శుద్ధి తో మనలో లిప్తమై పోవాలి .అప్పుడే ఆ జగన్మాత మనలో స్థిర నివాసము వుంటుంది.🌺 |