శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
109. మహాశక్తి: | ||
ఈశ్వరపదార్ధముయుక్క సంకల్పశక్తియే ఆద్యచైతన్యము, మహామాయా. సర్వ జగదధిష్టాత్రియైన మహాత్రిపురసుందరి అన్నింటియందు తానే వున్నది. మహా శక్తి అంటే సంకల్పశక్తియైన ఇచ్చా, జ్ఞాన, క్రియా స్వరూపిణియైన త్రిపురపరాదేవి. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺మనలో అమ్మవారి యందు, ఆత్మయందు కుతూహలం, పరిశీలనా శక్తి, క్రమక్రమంగా పెరుగుతాయి 🌺 |