శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
148. నిత్యశుద్ధా | ||
నామరూప స్ప్రుహ వదలనంత వరకు సర్వభావనలు మాయా - శ్రితములే. కావున అది శుద్ధతా రహితం. పరాదేవత మలరహిత కావున నిత్య శుద్ధ. పరంజ్యోతికి ఆవరణములు లేవు కావున ఆమె నిత్య శుద్ధ. త్రికాలములోనూ నిత్య శుద్దురాలైన తల్లికి నమస్కారము 🙏. 🌺అన్నింటిలో శుద్ధతత్వమును చూడగలిగే గుణం కలుగుతుంది. దానివలన ఒక శుద్ధ చైతన్య మనలో ప్రవేశించి, మనలో వుండే మాలిన్యాన్ని తుడిపివేస్తుంది. ముఖంలో వర్చస్సు కనిపిస్తుంది.నిత్య శుద్ధ గా ఆ తల్లీకి మనలో వుంటుంది 🌺 |