శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
127. శ్రీకరీ | ||
శ్రీకరీ అంటే ఈశ్వరత అనే ఐశ్వర్యాన్ని ఇచ్చేది. ఆమె ఇవ్వలేనిది ఏదీ లేదు. నిజమైన శ్రీవిద్యో పాసకులు నిష్కామ పూజ చేస్తారు. కామ్యాన్ని సంకల్పించరు. మూడు లిప్తలు ఆజ్ఞలో నిలిచిన సుషుమ్న కాంతి శ్రీచక్రమై మెరుస్తుంది. నీవే శ్రీచక్ర స్వరూపుడవు అన్న సత్యాన్ని శాంభవీ విద్యలో దర్శనం చేయిస్తుంది ఆ మాత. ఈ దర్శనము అయితేనే మహాయాగానికి అర్హతను అమ్మవారు ప్రసాదించినట్లు. ఇది శాంభవీ విద్యలో ఆరవ మెట్టు. లక్ష్మిని అంటే సంపదను ప్రసాదించే తల్లికి నమస్కారము 🙏 🌺జ్ఞానసంపదను పొంది, తత్ద్వారా ఐహిక, ఆముష్మిక ధర్మాలను పాటిస్తూ, ఆ లక్ష్మి కృప కు పార్త్రులం కాగలము🌺 |