శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
155. నిరీశ్వరా | ||
శ్రీలలితా పరాభట్టారికయే ఈశ్వరి. అనంత ప్రజ్ఞానంద ఘనేశ్వరి. ఆమెయే జగదధిష్టాత్రి. కాబట్టి ఆమె నిరీశ్వర. పిండాండములులో మూలాధారము నుండి ఆజ్ఞాచక్ర పర్యంతమూ బాలాత్రిపురసుందరి. ఆజ్ఞయందు తురీయంలో చండి. ఉన్మాని నుండి సహస్రార పర్యంతము శ్రీమహాత్రిపురసుందరి. సహస్రారంలో సదాశివ తేజేసుతో ఏకమైనప్పుడు శ్రీరాజరాజేశ్వరీ. బ్రహ్మశీర్షంలో శ్రీ లలితా పరాభట్టారిక. అన్నిటా, సర్వత్రా, ఆమెపైన ఎవ్వరు లేని తల్లికి నమస్కారము 🙏 🌺స్వచ్చంగా జీవిస్తున్న వ్యక్తిలోని నిర్మలత్వమే ఈశ్వరతత్వం. తనలోని ఆత్మవిశ్వాసం మరింత బల పడుతుంది. 🌺 |