శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
104. రుద్రగ్రంధి విభేధి | ||
దుఃఖము పోగొట్టువాడు రుద్రుడు. ఆజ్ఞ చక్రమే రుద్రగ్రంధి. అక్కడ విరాట్పురుషుడి దర్శనములో ఆ దుఃఖము సమసిపోయి, బ్రహ్మజ్ఞానప్రాప్తి, ఆత్మదర్శనము కలుగును. సుషుమ్న అచ్చట రుద్రగ్రంధిని ఛేదించుకొని సహస్రారమువైపు ప్రస్తానించును. ఆజ్ఞాచక్రము ముందుగా చెప్పబడినట్టుగా అనాహతము దాటియే అక్కడకు వెళ్లడం సంభవిస్తుంది.. విష్ణుగ్రంధిని భేదించి జీవ భావాన్ని తొలగించిన తరవాత రుద్రగ్రంధాన్ని భేదించి లయాదులను తొలగిస్తుంది. తద్వారా జగన్మాత సాధకుణ్ణి సహస్రారంలోని చిదానంద స్థితికి చేరుస్తుంది. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺బంధాలలో ఉంటూనే, వాటిలో ఇరుక్కుపోకుండా వుండే నిర్మల స్థితిని, ఆలోచన శక్తులను సంపాదించుకోగలుగుతాము 🌺 |