శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
125. శర్మదాయినీ | ||
శాంభవీ విద్య లో నాల్గవ మెట్టు. ఆజ్ఞాచక్రము అనబడే నాదచక్రంలో మనస్తత్వాన్ని దాటి మనోలయం అయినప్పుడు తురీయం అవుతుంది. అట్టి తురీయ ఆనందాన్ని కలిగించేదే శర్మదాయినీ. ద్విదళములు అనే నాదపాదుకల మధ్య ఆత్మజ్యోతి బ్రహ్మైవాహమస్మి అన్న చితకలాప్రత్యగాత్మ అవుతుంది. ఆ వెలుగుతో అకుల చక్రాలన్నియు వెలుగుతాయి. కళలన్నీ తానై నిష్కళంగా పైకి వెళ్ళుతాయి. వెల్లిముంది మూడు లిప్తల కాలము మూడువకన్నుగా ఆజ్ఞలో దర్శనము ఇస్తుంది. అదే ఆత్మదర్శనము. అట్టి ఆత్మ దర్శనాన్ని ఇచ్చేది శర్మదాయినీ. శర్మ అనగా సుఖము. దాయినీ అంటే ఇచ్చేది భక్తులకు సుఖాన్ని ఇచ్చే తల్లీ. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺ఈ నామంవల్ల మనలో చకట్టి ఆలోచన శక్తి పెరుగుతుంది. ఆలోచన శక్తి పెరగడం వల్ల, ఆత్మ పరిశోధన మొదలుపెడుతాము. 🌺 |